హైదరాబాద్‌లోని సీసీఎంబీ కేంద్రం తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి వచ్చిన నమూనాలను పరీక్షిస్తోంది. రోజుకు 350 పరీక్షలు నిర్వహిస్తోంది. నిమ్స్, ఐపీఎం, హైదరాబాద్ ఫీవర్ ఆస్పత్రి, వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలకు చెందిన 25 మంది వైద్యులు, టెక్నికల్ సిబ్బంది, విద్యార్థులకు శిక్షణ ఇచ్చింది. ఇప్పుడు వీరంతా తమ ఆస్పత్రుల్లోనే పరీక్షలు నిర్వహించగలుగుతున్నారు.
జన్యు పరిణామక్రమంపై..
ఆర్టీ-పీసీఆర్‌లో రోగి నమూనాలను ఎలా పరీక్షించాలో చెబుతూ వీడియో పాఠాలను సీసీఎంబీ అందిస్తోంది. ఈ వైరస్‌కు సంబంధించిన మొత్తం జన్యు పరిణామక్రమ పటాన్ని రూపొందించడానికి భవిష్యత్ తరం పరిణామక్రమంపై విశ్లేషణ మొదలుపెట్టింది. ఇందు కోసం వైరస్ ప్రభావం అత్యధికంగా ఉన్న రోగుల నమూనాలను సీసీఎంబీ సేకరించింది. ఇప్పటికే ఈ సంస్థ కొంతమంది రోగుల నుంచి సేకరించిన వైరస్‌ను ఐసోలేట్ చేసింది. వచ్చే మూడు నాలుగు వారాల్లో పరిణామక్రమాన్ని గుర్తించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.