ఆర్టీసీకి చెందిన 45 మంది సొంత భద్రతా సిబ్బంది... 24 గంటలూ పెట్రోలింగ్... అఫ్టల్గంజ్ పోలీసు సిబ్బంది... ఎంజీబీస్ నిర్వాహక సిబ్బంది.. తనిఖీ సిబ్బంది... ఇలా వందల్లో విధులు నిర్వహిస్తూ ఉంటారు. 127 సీసీటీవీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ సెంటర్... దీంతో పాటు అప్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్ ఔట్ పోస్టు కూడా ఎంజీబీఎస్‌లోనే కొనసాగుతోంది.
ఇంత పటిష్ఠమైన భద్రత ఉంటే ఇంకా తిరుగేముందని ప్రయాణికులు అనుకునేవారు. తమ వస్తువులు పక్కన పెట్టి మాటల్లో పడిపోయేవారు. లేదా సెల్ ఫోన్ సంభాషణలో మునిగిపోయేవారు. ఇందంతా ఒకప్పటి మాట. ప్రస్తుతం మీరు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా... మీ వస్తువులు మాయం అవుతాయి. ఇందుకు అక్కడ ప్రతి చోట కనిపించే హెచ్చరిక బోర్డులే నిదర్శనం. “ దొంగలున్నారు జాగ్రత్త .. మీ వస్తువులకు మీరు జాగ్రత్త వహించండి. బస్సులో మీ విలువైన వస్తువులు పెట్టి బయటకు వెళ్లకండి. ఎంజీబీఎస్ ప్రాంగణంలో కూడా మీ వస్తువులను భద్రంగా ఉంచుకోండి.. మీ వస్తువుల భద్రత మీదే " అనే హెచ్చరికలు కనిపిస్తున్నాయి. ప్రాంగణం బయట కూడా మీ వాహనాల భద్రతకు బాధ్యులు అనే హెచ్చరికల బోర్డులు ఎక్కడికక్కడ కనిపిస్తాయి.