తెలంగాణ

telangana

ETV Bharat / city

నేడు సీబీఎస్​ఈ ఆఫ్​లైన్ పరీక్షల షెడ్యూల్ విడుదల

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్.. సీబీఎస్​ఈ(CBSE) బోర్డ్ ఎగ్జామ్స్ 2021 పరీక్షల షెడ్యూల్​ను నేడు(ఆగష్టు 10, 2021) విడుదల చేయనుంది. CBSE అధికారిక సైట్‌లో ఈ తేదీల షీట్ అందుబాటులో ఉంటుంది.

cbse
cbse

By

Published : Aug 10, 2021, 6:01 PM IST

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్.. సీబీఎస్​ఈ(CBSE) బోర్డ్ ఎగ్జామ్స్ 2021 పరీక్షల షెడ్యూల్​ను నేడు(ఆగష్టు 10, 2021) విడుదల చేయనుంది. క్లాస్ 10, 12 విద్యార్థులందరికీ ఇంప్రూవ్​మెంట్, కంపార్ట్మెంట్, ప్రైవేటుతోపాటు కరెస్పాండెన్స్ కోర్సుల పరీక్షల కోసం ఆఫ్‌లైన్ తేదీలను బోర్డు ప్రకటిస్తుంది. CBSE అధికారిక సైట్‌ cbse.nic.in లో అభ్యర్థులకు ఈ తేదీల షీట్ అందుబాటులో ఉంటుంది.

CBSE 12 వ తరగతి పరీక్షా ఫలితాలను జూలై 30న, 10వ తరగతి పరీక్ష ఫలితాలను ఆగస్టు 3, 2021న బోర్డు విడుదల చేసింది. ఇచ్చిన మార్కులతో సంతృప్తి చెందని అభ్యర్థులు బోర్డు నిర్వహించే ప్రత్యక్ష పరీక్షలకు హాజరు కావచ్చు. బోర్డ్ 10, 12వ తరగతికి సంబంధించిన ఇంప్రూవ్​మెంట్, కంపార్ట్మెంట్ పరీక్షలను ఆగస్టు 16 నుండి సెప్టెంబర్ 15, 2021 వరకు నిర్వహించనుంది.

కంపార్ట్మెంట్, ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు దేశంలోనూ, విదేశాల్లోని పలు నిర్దేశిత కేంద్రాలలోనూ నిర్వహించనుంది. COVID19 ప్రోటోకాల్‌లను అనుసరించి ఈ పరీక్షలు జరగనున్నాయి.

2021 సంవత్సరానికి ఫలితాలు లెక్కించిన విధానం ఆధారంగా ప్రకటించిన ఫలితాలతో సంతృప్తి చెందని విద్యార్థులు, వచ్చినవాటికంటే మెరుగైన ఫలితాలు కావాలనుకునే విద్యార్థుల కోసం సీబీఎస్​ఈ పోర్టల్​లో త్వరలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ అందుబాటులోకి వస్తుంది. 2021లో ఫలితాలు గణించలేకపోయిన అభ్యర్థులు పరీక్షలకు నేరుగా హాజరు కావడానికి అనుమతించనున్నట్లు ఆగష్టు 2న బోర్డు ప్రకటనలో పేర్కొంది.

ఇదీ చదవండి :అమెరికాపై కరోనా పంజా- ఆస్పత్రుల్లో టెంట్ల కింద చికిత్స

ABOUT THE AUTHOR

...view details