CBN On Power Cuts: ఏపీ పూర్తిగా చీకట్లోకి వెళ్లిపోయిందని.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ కోతలతో ప్రసూతి ఆసుపత్రిలో బాలింతల పరిస్థితి వివరిస్తూ ఓ వీడియోను ఆయన ట్విటర్‌లో పోస్టు చేశారు. నాడు మిగులు విద్యుత్‌తో వెలుగులు నిండిన రాష్ట్రంలో.. నేటి ఈ చీకట్లకు కారణం ఎవరని నిలదీశారు. తీవ్రమైన విద్యుత్ కోతలతో జనం నరకం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో అనధికార పవర్ కట్‌లతో ప్రజలు అల్లాడిపోతున్నారని ధ్వజమెత్తారు.
'ఏపీ పూర్తిగా చీకట్లోకి వెళ్లిపోయింది..' ట్విటర్ వేదికగా బాబు ఆవేదన.. - చంద్రబాబు ట్విట్టర్
CBN On Power Cuts: ఆంధ్రప్రదేశ్ చీకట్లోకి వెళ్లిపోయిందని.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆవేదన చెందారు. విద్యుత్ కోతలతో ప్రసూతి ఆసుపత్రిలో బాలింతల పరిస్థితి వివరిస్తూ.. ఓ వీడియోను ట్విటర్‌లో పోస్టు చేశారు.
!['ఏపీ పూర్తిగా చీకట్లోకి వెళ్లిపోయింది..' ట్విటర్ వేదికగా బాబు ఆవేదన.. cbn-shared-a-video-on-his-twitter-saying-that-the-state-has-gone-into-darkness](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14955238-419-14955238-1649337373500.jpg)
cbn-shared-a-video-on-his-twitter-saying-that-the-state-has-gone-into-darkness
విద్యుత్ సరఫరా లేక ప్రసూతి ఆసుపత్రిలో గర్భిణులు, బాలింతలు పడుతున్న బాధలకు ముఖ్యమంత్రి ఏం సమాధానం చెపుతారని ప్రశ్నించారు. భారీగా పెరిగిన కరెంట్ బిల్లులు ప్రజలు కిమ్మనకుండా కడుతున్నా ఈ కోతలు ఎందుకని నిలదీశారు. ఓవైపు కరెంట్ లేక ప్రజలు రోడ్డెక్కుతుంటే.. వాలంటీర్లకు సన్మానం అంటూ 233 కోట్ల రూపాయలు తగలేస్తూ పండుగ చేసుకుంటున్న ఈ ముఖ్యమంత్రిని.. నీరో కాక ఇంకేమనాలని మండిపడ్డారు. విద్యుత్ కోతలను ప్రశ్నించిన సామాన్య ప్రజలపై బెదిరింపులు మాని.. సమస్యను పరిష్కరించాలని హితవుపలికారు.
'ఏపీ పూర్తిగా చీకట్లో వెళ్లిపోయింది..' ట్విట్టర్ వేదికగా బాబు ఆవేదన..
ఇదీ చదవండి :
Last Updated : Apr 7, 2022, 7:30 PM IST