తెలంగాణ

telangana

ETV Bharat / city

chandrababu: 'దేవినేని కాన్వాయ్​ను అడ్డుకోవటం దుర్మార్గం'

ఏపీ మాజీమంత్రి దేవినేని ఉమా కాన్వాయ్​ను పోలీసులు అడ్డుకోవటం దుర్మార్గమని తెదేపా అధినేత చంద్రబాబు ఆక్షేపించారు. ప్రజలు నీరాజనాలు పలుకుతుంటే తట్టుకోలేకే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని.. ఇది సిగ్గు చేటని మండిపడ్డారు.

By

Published : Aug 5, 2021, 10:54 PM IST

chandrababu
chandrababu

ఏపీ మాజీమంత్రి దేవినేని ఉమా కాన్వాయ్​ను అడ్డుకోవడం హేయమని చర్య అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. హింసించి ఆనందించటం జగన్​కు పరిపాటిగా మారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. "అక్రమ కేసులో అరెస్టై.. బెయిల్​పై తిరిగివస్తున్న దేవినేని ఉమా కాన్వాయ్​ను అడ్డుకోవటం దుర్మార్గం" అన్నారు. ప్రజలు నీరాజనాలు పలుకుతుంటే తట్టుకోలేక కవ్వింపు చర్యలకు పాల్పడటం సిగ్గుచేటని ధ్వజమెత్తారు.

జాతీయ రహదారిపై అడ్డంగా వాహనాలను నిలపడమేంటని పోలీసులను ప్రశ్నించారు. హనుమాన్ జంక్షన్ వద్ద ఆంజనేయస్వామి ఆలయంలో దేవినేని పూజలు నిర్వహిస్తారని తెలిసి.. పోలీసులే దగ్గరుండి గుడికి తాళాలు వేయించటం ఎంత వరకు సమంజసమని నిలదీశారు. చట్టాన్ని అధికార పక్షం చుట్టంలా మార్చుకుంటుందని ఆరోపించారు.

వాహనశ్రేణిని అడ్డుకోవటం దుర్మార్గం

బెయిల్​పై విడుదలైన దేవినేని ఉమా వాహనశ్రేణిని పోలీసులు అడ్డుకోవటం దుర్మార్గమని తెదేపా ఏపీ శాఖ అధ్యక్షులు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ఏపీలో పౌర స్వేచ్ఛ లేదా.. అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వైకాపా అవినీతిని తెదేపా నేతలు ప్రశ్నిస్తుంటే.. జగన్ అండ్ కో కక్షసాధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఏపీలో రాక్షస పాలనకు నిదర్శనంగా పోలీసులే రోడ్డుపై వాహనాలు అడ్డుగా పెట్టారన్నారు. ఇకనైనా జగన్ తన తప్పుడు విధానాలు మార్చుకోవాలని హితవు పలికారు.

'మీరు ఎలా వెళ్లారో మరిచారా ?'

అక్రమాస్తుల కేసులో బెయిల్​పై విడుదలై చంచలగూడ జైలు నుంచి రెట్టింపు ర్యాలీతో లోటస్ పాండ్​కు వెళ్లింది మరిచారా ? అని ముఖ్యమంత్రి జగన్​ను తెదేపా నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి వస్తున్న దేవినేని ఉమాను పోలీసులు అడ్డుకోవటం హేయమన్నారు. ప్రతిపక్షాలకో న్యాయం, అధికారపక్షానికో న్యాయమా ? అని నిలదీశారు. ఇది ప్రజాస్వామ్య పాలనా ? లేక రాక్షస పాలనా ? అని ఆక్షేపించారు.

'ఇంత దిగజారి ప్రవర్తిస్తారా ?'

ఏపీ పోలీసులు ఎందుకు దిగజారి ప్రవర్తిస్తున్నారని ఎమ్మెల్సీ అశోక్ బాబు ప్రశ్నించారు. హనుమాన్ జంక్షన్​లో ఆంజనేయస్వామి ఆలయాన్ని ఎందుకు మూసేయాల్సి వచ్చిందని నిలదీశారు. పోలీసులు ఏం చేస్తున్నారో డీజీపీకి తెలుస్తోందా ? అని ప్రశ్నించారు.

ఇదీచూడండి:Devineni Uma: రాజమహేంద్రవరం జైలు నుంచి దేవినేని ఉమ విడుదల

ABOUT THE AUTHOR

...view details