తెలంగాణ

telangana

ETV Bharat / city

వివేకా హత్య కేసు: పులివెందులకు సీబీఐ బృందం - వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు వార్తలు

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టేందుకు పులివెందులకు వెళ్లింది సీబీఐ బృందం.

cbi-team-went-to-pulivendula-to-investigate-vivekananda-reddy-murder-case
వివేకా హత్య కేసు: పులివెందులకు సీబీఐ బృందం

By

Published : Jul 19, 2020, 1:04 PM IST

ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును విచారించేందుకు సీబీఐ బృందం కడప నుంచి పులివెందులకు వెళ్లింది. ఈ బృందంలో మొత్తం ఏడుగురు సభ్యులు ఉన్నారు. శనివారం కడప ఆర్​ అండ్ బీ అతిథి గృహానికి చేరుకున్న సీబీఐ అధికారులు.. రాత్రి అక్కడే బస చేసి ఇవాళ ఉదయం పులివెందులకు వెళ్లారు. తొలుత వివేకానందరెడ్డి నివాసాన్ని పరిశీలించి దర్యాప్తు ప్రారంభిస్తారు. అనుమానితులను విచారిస్తారని సమాచారం.

ABOUT THE AUTHOR

...view details