ఏపీలోని విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి మత్తు వైద్యుడు సుధాకర్ కేసులో దర్యాప్తు పురోగతిని తెలియజేస్తూ సీల్డ్ కవర్లో రెండో స్థాయి నివేదికను సమర్పించినట్లు హైకోర్టుకు సీబీఐ తెలిపింది. కేసు సున్నితత్వం వల్ల దర్యాప్తు వివరాల్ని బహిర్గతం చేయలేమని పేర్కొంది. సీబీఐ దాఖలు చేసిన నివేదిక కేసు ఫైల్లో చేరకపోవడంతో విచారణ నేటికి వాయిదా పడింది. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.కుమార్, జస్టిస్ ఉమాదేవితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
డాక్టర్ సుధాకర్ కేసు... దర్యాప్తు పురోగతిపై సీబీఐ నివేదిక - ఏపీ హైకోర్టు వార్తలు
ఏపీలోని నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు సుధాకర్ కేసులో దర్యాప్తు పురోగతిని సీల్డ్ కవర్లో రెండో స్థాయి నివేదికను సమర్పించినట్లు ఏపీ హైకోర్టుకు సీబీఐ తెలిపింది. కేసు సున్నితత్వం వల్ల దర్యాప్తు వివరాల్ని బహిర్గతం చేయలేమని సీబీఐ తెలిపింది. ఈ కేసు విచారణను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది.
విశాఖ పోలీసులు డాక్టర్ సుధాకర్‌తో వ్యవహరించిన తీరుపై వీడియో క్లిప్పింగ్‌ను జత చేస్తూ తెదేపా మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత రాసిన లేఖను సుమోటోగా పరిగణించిన హైకోర్టు గత మే 22న సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన విషయం తెలిసిందే. బాధ్యులపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని స్పష్టం చేసింది. ఈ ఘటనలో కుట్ర కోణం దాగుందేమో తేల్చాలని పేర్కొంది. తాజాగా జరిగిన విచారణలో సీబీఐ పీపీ చెన్నకేశవులు వాదనలు వినిపిస్తూ రెండో స్థాయి నివేదికను సీల్డ్ కవర్లో ఏపీ హైకోర్టుకు సమర్పించామన్నారు. దర్యాప్తు స్థితి ఏమిటని ధర్మాసనం ప్రశ్నించగా .. కేసు సున్నితత్వం వల్ల వివరాల్ని బహిర్గతం చేయలేమన్నారు.
ఇదీ చదవండి :మోగిన బల్దియా నగారా.. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ