సోషల్ మీడియాలో జడ్జీలపై వ్యాఖ్యల(social media posts on judges) కేసుకు సంబంధించిన అఫిడవిట్‌ను.. పిటిషనర్లకు పంపింది సీబీఐ. ఇప్పటికే హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌ను(cbi affidavit on social media posts on judges) సీబీఐ తాజాగా.. పిటిషనర్లకు అందజేసింది. జడ్జీలపై వ్యాఖ్యల కేసులో అభియాగాలు ఎదుర్కొంటున్న పంచ్ ప్రభాకర్ పై.. నవంబర్ 1న లుకౌట్ నోటీసులు(lookout notice to punch prabhakar) జారీ చేసినట్లు సీబీఐ వెల్లడించింది. అతని అరెస్టుకు నవంబర్ 8న వారెంట్ తీసుకున్నట్లు పేర్కొంది.
జడ్జీలపై సోషల్ మీడియాలో పోస్టుల కేసు.. పిటిషనర్లకు సీబీఐ అఫిడవిట్
జడ్జీలపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల(social media posts on judges) కేసులో.. సీబీఐ అఫిడవిట్‌ను పిటిషనర్లకు పంపింది. పంచ్ ప్రభాకర్‌పై నవంబర్ 1న లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించిన సీబీఐ.. ఆయన అరెస్టుకు నవంబర్ 8న వారెంట్ తీసుకున్నట్లు పేర్కొంది.
cbi-sends-affidavit-to-petitioners-in-case-of-posts-against-judges
ఇంటర్ పోల్తోనూ సంప్రదింపులు జరుపుతున్నామన్న సీబీఐ.. ఈ నెల 9 న ప్రభాకర్ అరెస్టుకు ఇంటర్ పోల్‌కు విజ్ఞప్తి చేసినట్లు తెలిపింది. ఈ నెల 15న యూట్యూబ్‌తో మాట్లాడినట్లు, కేసుకు సంబంధం ఉన్న అందరినీ విచారిస్తున్నట్లు తెలిపింది. కేసులో 17వ నిందితుడిగా పంచ్ ప్రభాకర్‌ను చేర్చినట్లు వెల్లడించింది.
ఇదీ చూడండి: