తెలంగాణ

telangana

ETV Bharat / city

JAGAN: జగన్ డిశ్చార్జ్ పిటిషన్‌పై కౌంటరు దాఖలుకు సమయం కోరిన సీబీఐ - cbi court on cm jagan illigal assets case

అక్రమాస్తుల కేసులో.. జగన్ డిశ్చార్జ్ పిటిషన్‌పై కౌంటరు దాఖలుకు సీబీఐ మరింత సమయం కోరింది. పెన్నా ఛార్జ్‌షీట్ నుంచి పేరు తొలగించాలన్న జగన్ పిటిషన్‌పై సీబీఐ కోర్టు ఇవాళ విచారణ చేసింది.

cbi
జగన్

By

Published : Jul 22, 2021, 6:17 PM IST

హైదరాబాద్‌ సీబీఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసులపై విచారణ జరిగింది. పెన్నా ఛార్జ్‌షీట్ నుంచి తొలగించాలన్న జగన్ పిటిషన్‌ విచారణకు వచ్చింది. జగన్ డిశ్చార్జ్ పిటిషన్‌పై కౌంటరు దాఖలుకు సీబీఐ మరింత సమయం కోరింది. పెన్నా, ఇందూ టెక్‌జోన్ కేసుల నుంచి తొలగించాలని సబిత పిటిషన్లపై విచారణ జరిగింది. సబిత డిశ్చార్జ్ పిటిషన్లపై కౌంటరు దాఖలుకు సీబీఐ సమయం కోరింది. శామ్యూల్, రాజగోపాల్ డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణ ఆగస్టు 2కు వాయిదా పడింది. విదేశాలకు వెళ్లేందుకు అనుమతివ్వాలని విజయసాయిరెడ్డి కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది.

ఓఎంసీ కేసు విచారణ ..

హైదరాబాద్‌ సీబీఐ కోర్టులో ఓఎంసీ కేసు విచారణ జరిగింది. డిశ్చార్జ్ పిటిషన్‌పై వాదనలకు సిద్ధం కావాలని సబితకు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఐఏఎస్ శ్రీలక్ష్మి డిశ్చార్జ్ పిటిషన్‌పై విచారణ ఈనెల 27కు వాయిదా పడింది. ఓఎంసీ కేసులో మరో ఛార్జ్‌షీట్ వేయబోయమని సీబీఐ తెలిపింది.

ఇదీ చదవండి:NEW CHARGES FROM TODAY: నేటి నుంచే కొత్త రుసుములు.. ఆస్తుల విలువ పెంపు!

ABOUT THE AUTHOR

...view details