మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు దూకుడు పెంచారు. ఏపీ పులివెందులలోని అనుమానితుల ఇళ్లలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. సునీల్ యాదవ్, దస్తగిరి కుటుంబసభ్యుల ఇళ్లలో సోదాలు నిర్వహించి కత్తి, కొడవలి, పలుగు, పారను స్వాధీనం చేసుకున్నారు. వైఎస్ అభిషేక్‌రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
విచారణ వేగవంతం..
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో 66వ రోజు విచారణ కొనసాగుతోంది. కడప, పులివెందుల ప్రాంతాల్లో అనుమానితులను విచారిస్తున్నారు. కడప కేంద్ర కారాగారానికి కర్ణాటక నుంచి 20 వాహనాల్లో బ్యాంకు అధికారులు, రెవెన్యూ అధికారులు వచ్చినట్టు సమాచారం.