YS Viveka murder case: మాజీమంత్రి వివేకా హత్యకు సుపారీగా చెల్లించిన డబ్బును నిందితులకు ఎవరిచ్చారు? అంత మొత్తం ఎక్కడి నుంచి, ఎలా వచ్చిందనే అంశాలపై సీబీఐ కొన్ని ఆధారాలు సేకరించినట్లు తెలిసింది. వివేకాను అంతమొందిస్తే దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి రూ. 40 కోట్లు ఇస్తారని.. అందులో రూ. 5 కోట్లు తనకు ఇస్తారని ఎర్రగంగిరెడ్డి చెప్పారని అప్రూవర్‌గా మారిన షేక్ దస్తగిరి వాంగ్మూలం ఇచ్చారు. ఈ క్రమంలో వివేకా హత్యకు ముందు.. ఆ తర్వాత ఎంత మొత్తం చేతులు మారిందనే అంశంపై సీబీఐ దృష్టిసారించింది. నిందితులకు అడ్వాన్సుగా చెల్లించిన డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? వాటి వెనుకున్న ఆర్థికమూలాలపై కొన్ని ఆధారాలు సేకరించింది.
సుపారీ సొమ్ము మూలాలు తెలిస్తే కుట్రదారులెవరో తేలిపోతుంది..
YS Viveka murder case News : మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ అధికారులు... లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు సుపారీ డబ్బును నిందితులు ఎవరికి ఇచ్చారు? ఆ నగదు ఎలా వచ్చిందనే అంశాలపై సీబీఐ దృష్టి పెట్టింది. దీనికి... కొన్ని ఆధారాలు సేకరించినట్లు సమాచారం. వివేకా హత్య కుట్ర 2019 ఫిబ్రవరి 10న ఎర్ర గంగిరెడ్డి ఇంట్లోనే జరిగిందని.. దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడు. తర్వాత నాలుగు రోజులకు సునీల్ యాదవ్.. కోటి రూపాయలు తీసుకొచ్చి సుపారీ అడ్వాన్సుగా ఇచ్చారని దస్తగిరి తెలిపాడు. అయితే ఆ డబ్బులు సునీల్ యాదవ్‌కి ఎవరిచ్చారు? వాళ్లకు ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే అంశాలపై సీబీఐ ఇప్పటికే ఆరాతీసింది. సుపారీ సొమ్ము మూలాలు తెలిస్తే కుట్రదారులెవరో తేలిపోతుందని సీబీఐ భావిస్తోంది.