ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో 68 రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప, పులివెందుల ప్రాంతాల్లో రెండు బృందాలుగా విడిపోయిన అధికారులు అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. ఇవాళ పులివెందుల ఆర్ అండ్ బీ అతిథి గృహంలో వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఉమా శంకర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఇతను ఎంపీ అవినాష్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కావడంతో పాటు కేసులో కీలక అనుమానితులుగా ఉన్నారు.
Ys viveka murder case: కడప, పులివెందులలో అనుమానితుల విచారణ - వైఎస్ వివేకా హత్యకేసులో సీబీఐ విచారణ
ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు(viveka murder case)లో సీబీఐ(CBI) దర్యాప్తు 68వ రోజు కొనసాగుతోంది. కడప, పులివెందులలో పలువురు అనుమానితులను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.
పులివెందుల క్యాంపు కార్యాలయంలో పనిచేసే రఘునాథ్ రెడ్డిని కూడా అధికారులు ప్రశ్నిస్తున్నారు. కడపలోనూ మరో నలుగురు అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. వివేకా కారు డ్రైవర్ దస్తగిరిని సీబీఐ అధికారులు.. నిన్న రాత్రి నుంచి విచారిస్తున్నారు. కస్టడీలో ఉన్న సునీల్ యాదవ్‌పై విచారణ కొనసాగుతోంది. అతని బంధువు భరత్ యాదవ్‌ను కూడా నేడు ప్రశ్నిస్తున్నారు. సునీల్‌ను కలిసేందుకు అతని తల్లి సావిత్రి, భార్య లక్ష్మి కడప కేంద్ర కారాగారానికి వచ్చారు.
ఇదీ చదవండి:Nagula panchami: ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ... భక్తులతో కిటకిట