ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా.. సీబీఐ అధికారులు కడప జిల్లా పులివెందులకు చేరుకున్నారు. పులివెందుల ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో.. వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డిని విచారిస్తున్నారు. వివేకా వ్యక్తిగత కార్యదర్శి హిదయతుల్లానూ కూడా ప్రశ్నిస్తున్నారు. సాక్ష్యాల తారుమారు కేసులో రెండేళ్ల క్రితమే గంగిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
వివేకా హత్య కేసు: ఎర్ర గంగిరెడ్డిని విచారిస్తున్న సీబీఐ - కడప జిల్లా పులివెందులలో వైఎస్ వివేకా హత్య కేసు విచారణ
ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా.. వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డిని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. కడప జిల్లాలోని పులివెందుల ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో అధికారులు విచారణ చేపట్టారు.
వివేకా హత్య కేసు