ట్రాన్స్ట్రాయ్ కంపెనీ యజమానులతో పాటు... భాగస్వామిగా ఉన్న రాయపాటి ఇంట్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇవాళ ఉదయం 5.30 గంటల సమయంలో 10మంది సీబీఐ అధికారుల బృందం... ఆంధ్రప్రదేశ్ గుంటూరు చంద్రమౌళినగర్లోని రాయపాటి ఇంటికి వచ్చింది. సీబీఐ అధికారులు వచ్చిన సమయంలో రాయపాటి సాంబశివరావు ఇంట్లో లేరు.
ఆయన కుమారుడు రంగబాబుతో మాట్లాడిన అధికారులు... సోదాలకు సహకరించాలని కోరారు. రంగబాబు, ఇంట్లో ఉన్నవారి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రాయపాటి ఇంట్లో అణువణువూ గాలిస్తున్నారు. ఇంటి ప్రాంగణంలోని కార్లు, నివాసం ముందు నిలిపి ఉంచిన కార్లలోనూ తనిఖీలు చేశారు.