తెలంగాణ

telangana

ETV Bharat / city

Viveka Murder Case: 39వ రోజూ కొనసాగుతున్న సీబీఐ విచారణ - viveka case cbi interrogation

ఏపీకి చెందిన మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. వరుసగా 39వ రోజూ విచారణ కొనసాగిస్తున్న సీబీఐ.. నలుగురు అనుమానితులను ప్రశ్నిస్తోంది. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, అతని సోదరుడు సిద్ధారెడ్డిలతో పాటు మరో ఇద్దరు అనుమానితులను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

39వ రోజూ కొనసాగుతున్న సీబీఐ విచారణ
39వ రోజూ కొనసాగుతున్న సీబీఐ విచారణ

By

Published : Jul 15, 2021, 4:21 PM IST

ఆంధ్రప్రదేశ్​ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకా హత్య కేసు విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. విచారణను వేగవంతం చేసిన సీబీఐ అధికారులు.. 39వ రోజు నలుగురు అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, అతని సోదరుడు సిద్ధారెడ్డితో పాటు మరో ఇద్దరు అనుమానితులను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. దాదాపు రెండు వారాల నుంచి ఎర్ర గంగిరెడ్డి, డ్రైవర్​ దస్తగిరిని వరుసగా విచారిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

వివేకా హత్య జరగడానికి ఆరు నెలల ముందు దస్తగిరి పని మానేశాడు. ఇతడు ఇచ్చిన కొన్ని కీలక ఆధారాలతో గత నెల రోజుల నుంచి సీబీఐ అధికారులు పలువురు అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. హత్య జరిగిన రోజు సాక్ష్యాలు తారుమారు చేశారనే కేసులో రెండేళ్ల కిందట ఎర్ర గంగిరెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం బెయిల్​పై ఉన్న వీరిని సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఘటన రోజు ఏం జరిగిందన్న విషయంపై.. మరింత స్పష్టత వచ్చే దిశగా కీలక సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

విచారణలో దూకుడు..

వివేకా హత్య కేసును సవాలుగా తీసుకున్న సీబీఐ అధికారులు విచారణలో దూకుడు పెంచారు. గత 39 రోజులుగా పలువురు అనుమానితులను విచారించారు. ఈ కేసులో అధికారులు కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. 2019 మార్చి 15న వివేకా దారుణ హత్యకు గురికాగా.. మార్చి 14 అర్ధరాత్రి పులివెందులలో అనుమానాస్పదంగా తిరిగిన పలు వాహనాల వివరాలను సేకరించి ఆ దిశగా విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి:hyderabad floods: సరూర్​నగర్​లో వరదలు.. ఇళ్లు వదిలివెళ్తున్న స్థానికులు

ABOUT THE AUTHOR

...view details