మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు నాలుగో రోజు విచారణ చేపట్టారు. ఏపీ పులివెందులలోని డీఎస్పీ కార్యాలయానికి చేరుకున్న సీబీఐ బృందం.. హత్యకు సంబంధించి మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. మూడు రోజుల విచారణలో భాగంగా పులివెందులలోని వివేకా నివాసానికి చేరుకున్న సీబీఐ అధికారులు... రెండు గంటలకు పైగానే పరిశీలించారు. వివేకా హత్యకు గురైన బెడ్ రూం, బాత్ రూం ప్రదేశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
వివేకా భార్య సౌభాగ్యమ్మతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వివేక ఇంటి కొలతలనూ అధికారులు తీసుకున్నారు. మున్సిపాలిటీ సర్వేయర్ ద్వారా కొలతలు వేయించారు. మాజీ మంత్రి ఇంటి బెడ్రూం, బాత్రూంతోపాటు ఎన్ని గదులు, ఎన్ని కిటికీలు ఉన్నాయని ఆరా తీశారు. నిన్న కుటుంబ సభ్యులను నాలుగు గంటల పాటు విచారించారు.