YS Viveka Murder Case: మాజీ మంత్రి వివేకా హత్యకేసులో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిపై సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. శివశంకర్‌రెడ్డిని ఐదో నిందితుడిగా చేరుస్తూ పులివెందుల కోర్టులో సీబీఐ అధికారులు ఛార్జిషీట్ వేశారు. మొదటి ఛార్జిషీట్‌లో ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరి పేర్లు చేర్చగా.. రెండో ఛార్జిషీట్‌లో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి పేరు చేర్చారు.
వివేకా హత్య కేసు.. దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిపై సీబీఐ ఛార్జిషీట్ - Devireddy Shiva Shankar Reddy news
YS Viveka Murder Case: ఏపీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది. ఈ మేరకు పులివెందుల కోర్టులో సీబీఐ అధికారులు మరో ఛార్జిషీట్ వేశారు. వివేకా హత్య కేసులో శివశంకర్‌రెడ్డిని ఐదో నిందితుడిగా సీబీఐ పేర్కొంది.
వివేకా హత్య కేసు.. దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిపై సీబీఐ ఛార్జిషీట్
మరోవైపు ఈ కేసులో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు గత నెలలో కొట్టేసింది. హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కీలక దశలో ఉన్నందున బెయిల్ మంజూరు సాధ్యం కాదని తేల్చిచెప్పింది. కేసు తీవ్రత , ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని దిగువ కోర్టు సైతం బెయిల్ నిరాకరించిందని గుర్తుచేసింది. ఈ క్రమంలో సీబీఐ దాఖలు చేసిన రెండో ఛార్జిషీటులోనూ శివశంకర్ రెడ్డి పేర్చు చేర్చటం ఆసక్తిని రేపుతోంది.
ఇదీ చూడండి: