ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది(cbi files chargesheet in viveka murder case news). ఈ కేసుకు సంబంధించి మొత్తంగా నలుగురు నిందితులపై అభియోగపత్రం దాఖలు చేసింది. వీరిలో టి.గంగిరెడ్డి, వై.సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి, షేక్ దస్తగిరి నిందితులుగా ఉన్నారు.
మరోవైపు.. వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు మంగళవారం ప్రాథమిక ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కడప నుంచి పులివెందుల కోర్టుకు వచ్చిన సీబీఐ అధికారులు.. ఐదారు సంచుల్లో కేసుకు సంబంధించిన దస్త్రాలను తీసుకొచ్చారు. పులివెందుల కోర్టులో కేసుకు సంబంధించిన ఆధారాలను సమర్పించిన అధికారులు ప్రాథమిక ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు.