తెలంగాణ

telangana

ETV Bharat / city

Viveka murder case: ఎర్ర గంగిరెడ్డి విచారణ.. అరెస్టుకు రంగం సిద్ధమైందా..! - VIVEKA CASE

ఏపీకి చెందిన మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ 100వ రోజు కొనసాగింది. అందులో భాగంగా.. వివేకా ముఖ్య అనుచరుడు ఎర్ర గంగిరెడ్డిని కడపలో సాయంత్రం నుంచి సీబీఐ అధికారులు ప్రశ్నించారు.

Viveka murder case: ఎర్ర గంగిరెడ్డి విచారణ.. అరెస్టుకు రంగం సిద్ధమైందా..!
Viveka murder case: ఎర్ర గంగిరెడ్డి విచారణ.. అరెస్టుకు రంగం సిద్ధమైందా..!

By

Published : Sep 16, 2021, 5:01 AM IST

ఏపీకి చెందిన మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ 100వ రోజు కొనసాగింది. అందులో భాగంగా.. వివేకా ముఖ్య అనుచరుడు ఎర్ర గంగిరెడ్డిని కడపలో సాయంత్రం నుంచి సీబీఐ అధికారులు ప్రశ్నించారు. విచారణ అనంతరం ఎర్ర గంగిరెడ్డికి కడప రిమ్స్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎర్ర గంగిరెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేయనున్నట్లు తెలుస్తోంది.

సునీల్ రిమాండ్ పొడిగింపు..

నిందితుడు సునీల్ యాదవ్ రక్త నమూనాలు సేకరించేందుకు అనుమతి కోరుతూ సీబీఐ పులివెందుల కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వాదనలు విన్న పులివెందుల కోర్టు నమూనాల సేకరణకు అనుమతి నిరాకరించింది. నిందితుడు సునీల్‌యాదవ్‌కు.. ఈనెల 29 వరకు రిమాండ్ పొడిగించింది. ఈ కేసులో మరో నిందితుడైన ఉమాశంకర్‌రెడ్డిని కస్టడీకి కోరుతూ సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. దీనిపై విచారణ నేడు జరగనుంది.

ఇదీ చదవండి:Saidabad rape case : సైదాబాద్‌ కేసు నిందితుడి కోసం గాలింపు.. వేషం మార్చినా గుర్తుపట్టేలా ఫొటోలు

ABOUT THE AUTHOR

...view details