ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య (Viveka murder case) కేసులో 18వ రోజు సీబీఐ (CBI) విచారణ కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో అధికారులు.. అనుమానితులను విచారణ చేస్తున్నారు. పులివెందులకు చెందిన ఫైనాన్స్ ఉద్యోగి బాలు.. సీబీఐ విచారణకు ఇవాళ హాజరయ్యారు. బాలు ద్వారా అనుమానితులు భారీగా డబ్బులు రుణం కింద తీసుకుని ఉంటారనే సమాచారం మేరకు సీబీఐ ఆరా తీస్తోంది. అనుమానాలను నివృత్తి చేసుకోవటానికే అధికారులు బాలును భిన్న కోణాల్లో ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు... కడప నుంచి పులివెందుల వెళ్లిన సీబీఐ అధికారుల బృందం మరోసారి వివేకా ఇంటిని పరిశీలించింది. వివేకా భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీతతో బృంద సభ్యులు చర్చించారు.
విచారణ వేగవంతం..