తెలంగాణ

telangana

ETV Bharat / city

జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ, ఈడీ కోర్టు కీలక నిర్ణయం - ap-cm-jagan-disproportionate-assets-case

cbi-edi-court-made-a-key-decision-in-ap-cm-jagan-disproportionate-assets-case
ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ, ఈడీ కోర్టు కీలక నిర్ణయం

By

Published : Jan 11, 2021, 2:59 PM IST

Updated : Jan 11, 2021, 3:44 PM IST

14:55 January 11

'సీబీఐ కేసులతో సంబంధం లేకుండా ఈడీ కేసుల విచారణ'

 ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో సీబీఐ, ఈడీ కోర్టు కీలక నిర్ణయం వెల్లడించింది. సీబీఐతో సంబంధం లేకుండా ఈడీ కేసుల విచారణ చేపట్టొచ్చని స్పష్టం చేసింది. సీబీఐ ఛార్జిషీట్లు తేలిన తర్వాతే ఈడీ కేసుల విచారణ జరపాలన్న జగన్ వాదనను కోర్టు తోసిపుచ్చింది.

సీబీఐ, ఈడీ ఛార్జిషీట్లలో నేరాభియోగాలు వేర్వేరని, ముందుగా ఈడీ కేసుల విచారణ చేపడతామని స్పష్టం చేసింది. ఈడీ కేసుల్లో అభియోగాల నమోదు కోసం విచారణను ఈనెల 21కి వాయిదా వేసింది.  

హెటిరో, అరబిందో ఫార్మా సంస్థలకు భూముల కేటాయింపునకు సంబంధించి విచారణ చేపట్టిన ఈడీ.. ఈ కేసులో నిందితులుగా ఉన్న జగన్, విజయసాయి రెడ్డితో పాటు.. మిగతా నిందితులంతా హాజరు కావాల్సిందేనని గతంలో ఆదేశించింది. ఏపీ ముఖ్యమంత్రిగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున జగన్ హాజరు కాలేరని ఆయన తరఫు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. దీనికి కోర్టు అంగీకారం తెలిపింది. 

Last Updated : Jan 11, 2021, 3:44 PM IST

ABOUT THE AUTHOR

...view details