సీబీఐ, ఈడీ కోర్టులో ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ (ap cm Jagan cases) జరిగింది. జగతి పబ్లికేషన్స్‌ను ఈడీ కేసు నుంచి తొలగించాలన్న పిటిషన్‌పై జగన్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. డిశ్చార్జ్ పిటిషన్‌పై వాదనలను ఈనెల 25కు కోర్టు వాయిదా వేసింది.
దర్యాప్తు పూర్తయింది: ఈడీ
ఎమ్మార్ కేసులో దర్యాప్తు పూర్తయిందని సీబీఐ కోర్టుకు ఈడీ తెలిపింది. అభియోగాల నమోదుపై నిందితుల వాదనల కోసం విచారణను కోర్టు ఈనెల 27కు వాయిదా వేసింది. ఎమ్మార్ కేసులో కోనేరు మధుపై ఎల్ఓఆర్ వివరాలు తెలపాలని సీబీఐని ఆదేశించింది .
ఇదీచూడండి:Viral Image: బీరువాల నిండా నోట్ల కట్టలు.. ఇంత డబ్బు ఎవరిది.. వాళ్లదేనా..?