అక్రమాస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM JAGAN) బెయిల్ రద్దుకు సీబీఐ న్యాయస్థానం (CBI COURT) నిరాకరించింది. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి (YSRCP MP VIJAYSAI REDDY) బెయిల్ రద్దుకూ సీబీఐ కోర్టు (CBI COURT) నిరాకరించింది. ఈ కేసుకు సంబంధించి ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా సాక్షులను ప్రభావితం చేస్తున్నారనే ఆరోపణలతో సీఎం జగన్, వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిల బెయిల్ రద్దు చేయాలని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
Jagan Bail case: జగన్ బెయిల్ రద్దుకు సీబీఐ కోర్టు నిరాకరణ.. రఘురామ పిటిషన్ కొట్టివేత - AP NEWS
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ (AP CM JAGAN), వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి బెయిల్ రద్దుకు సీబీఐ కోర్టు నిరాకరించింది. ఎంపీ రఘురామరాజు పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది.
అక్రమాస్తుల కేసుపై సీబీఐ న్యాయస్థానంలో గత రెండు మూడు నెలలుగా సుదీర్ఘ విచారణ జరిగింది. బెయిల్ మంజూరు చేసిన సందర్భంలో సీబీఐ కోర్టు విధించిన షరతులను జగన్, విజయసాయిరెడ్డి ఉల్లంఘించారని.. అందువల్ల వారి బెయిల్ రద్దు చేయాలని రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాదులు వాదించారు. అయితే తాము ఎలాంటి షరతులు ఉల్లంఘించలేదని.. కేవలం రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసమే రఘురామ పిటిషన్ దాఖలు చేశారని జగన్ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం రఘురామరాజు పిటిషన్‌ను కొట్టేసింది. సీబీఐ కోర్టు తీర్పుపై హైకోర్టుకు వెళ్లనున్నట్లు ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు.
ఇదీ చదవండి:green channel: కానిస్టేబుల్ నుంచి పెయింటర్‌కు హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్