ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి విచారణకు తప్పక హాజరు కావాల్సిందేనని హైదరాబాద్ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించింది. ఈ నెల 10న విచారణకు రావాలని సీఎం జగన్‌తో పాటు... వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డికి స్పష్టం చేసింది. నేడు హాజరు నుంచి జగన్, విజయసాయి రెడ్డి మినహాయింపు కోరగా... పదే పదే అడగటం ఏంటని కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. వచ్చే శుక్రవారం విచారణకు తప్పకుండా హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.
వచ్చే శుక్రవారం విచారణకు తప్పక రావాల్సిందే... - సీఎం జగన్కు సీబీఐ కోర్టు షాక్
ఏపీ ముఖ్యమంత్రి జగన్, ఎంపీ విజయసాయి రెడ్డికి సీబీఐ కోర్టు షాక్ ఇచ్చింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరిన వీరిని కోర్టు నిరాకరించింది. వచ్చే శుక్రవారం తప్పకుండా రావాలని ఆదేశాలు ఇచ్చింది.
వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునకు కోర్టు నిరాకరణ