తెలంగాణ

telangana

By

Published : Jul 26, 2021, 4:49 AM IST

Updated : Jul 26, 2021, 8:13 AM IST

ETV Bharat / city

JAGAN CASE: 'జగన్​ బెయిల్​ రద్దు పిటిషన్​'పై నేడు సీబీఐ వాదనలు

అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ.. ఎంపీ రఘురామ వేసిన పిటిషన్​పై ఇవాళ సీబీఐ కోర్టులో విచారణ జరగనుంది. రఘురామ, జగన్ ఇప్పటికే వాదనలు వినిపించటంతో పాటు కోర్టుకు లిఖితపూర్వకంగా సమర్పించారు. నేడు సీబీఐ తన వాదనలను సమర్పించనుంది.

JAGAN CASE
JAGAN CASE

అక్రమాస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్​మోహన్​రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్​పై సీబీఐ కోర్టులో నేడు విచారణ జరగనుంది. రఘురామ కృష్ణరాజు, జగన్ ఇప్పటికే వాదనలు వినిపించటంతో పాటు కోర్టుకు లిఖితపూర్వకంగా సమర్పించారు. సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉందని.. షరతులు ఉల్లంఘించినందున జగన్ బెయిల్ రద్దు చేయాలని రఘురామ వాదన. తాను ఒక్క షరతు కూడా ఉల్లంఘించలేదని.. రఘురామ రాజకీయ ప్రయోజనాల కోసం కేసుకు సంబంధం లేని ఊహా జనిత అంశాలతో పిటిషన్ వేశారని జగన్ వాదన.

తాము వాదించేదేమీ లేదని.. విచక్షణ మేరకు చట్టప్రకారం పిటిషన్​లోని అంశాలపై నిర్ణయం తీసుకోవాలని సీబీఐ పేర్కొంది. అయితే తాము కూడా లిఖితపూర్వకంగా వాదనలు సమర్పిస్తామని.. పది రోజుల సమయం ఇవ్వాలని ఈ నెల 14న కోర్టును సీబీఐ కోరింది. అంగీకరించిన సీబీఐ కోర్టు నేటికి వాయిదా వేసింది. ఇవాళ సీబీఐ ఏం చెప్పబోతోందనేది తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.

ఇదీ చూడండి: Jagan cases: జగన్ అక్రమాస్తుల కేసులపై సీబీఐ కోర్టు విచారణ

Last Updated : Jul 26, 2021, 8:13 AM IST

ABOUT THE AUTHOR

...view details