తెలంగాణ

telangana

ETV Bharat / city

జగన్​ వ్యక్తిగత హాజరు మినహాయింపు వ్యాజ్యంపై విచారణ!

వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ జగన్​ దాఖలు చేసిన వ్యాజ్యం విచారణకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం అంగీకరించింది. ఈకేసులో ఇరువర్గాల వాదనలు విని ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు న్యాయస్థానం స్పష్టంచేసింది.

విచారణకు జగన్​ వ్యక్తిగత హాజరు మినహాయింపు వ్యాజ్యం

By

Published : Sep 20, 2019, 11:50 PM IST

విచారణకు జగన్​ వ్యక్తిగత హాజరు మినహాయింపు వ్యాజ్యం

అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ ఏపీ సీఎం జగన్ చేసిన అభ్యర్థనపై ఇరువర్గాల వాదనలు వినాలని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం నిర్ణయించింది. ముఖ్యమంత్రిగా పరిపాలన, ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టాల్సి ఉన్నందున.. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరారు. గతంలో ఇదే అభ్యర్థనను హైకోర్టు కొట్టివేసినందున.. ప్రస్తుతం ఎలా విచారణ చేపట్టవచ్చునో వివరించాలని సీబీఐ కోర్టు పేర్కొంది. విచారణ అర్హతపై జగన్ తరఫు సీనియర్ న్యాయవాది నిరంజన్​రెడ్డి వాదనలు వినిపించారు. పరిస్థితులు మారిన నేపథ్యంలో మళ్లీ విచారణ చేయాలంటూ పలు హైకోర్టుల తీర్పులను ఉదహరించారు. హాజరు నుంచి మినహాయింపు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్​ను 2014లో కొట్టివేసినా.. 2016లో విచారణకు స్వీకరించినట్లు గుర్తుచేశారు. జగన్​ తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన సీబీఐ కోర్టు ఆ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించింది.

ఇవాళ్టి విచారణకు పారిశ్రామికవేత్తలు అయోధ్యరామిరెడ్డి, ఇందూ శ్యాంప్రసాద్​రెడ్డి, విశ్రాంత ఐఏఎస్​ శామ్యుల్​, కృపానందం హాజరయ్యారు. జగన్​తోపాటు విజయ్​సాయిరెడ్డి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి, తితిదే ఛైర్మన్​ వైవీ సుబ్బారెడ్డి గైర్హాజరుకు సీబీఐ, ఈడీ కోర్టు అనుమతిచ్చింది.

ఇవీ చూడండి: "రేవంత్​ నా ముద్దుల అన్నయ్యే కానీ.. 'ఏబీసీడీ'లు బాధించాయి"

ABOUT THE AUTHOR

...view details