తెలంగాణ

telangana

ETV Bharat / city

ys Viveka Case: సీబీఐ ఏఎస్పీ పిటిషన్​పై హైకోర్టు కీలక ఉత్తర్వులు - సీబీఐ ఏఎస్పీ రామ్‌సింగ్‌ పిటిషన్‌ న్యూస్

ys Viveka Case: సీబీఐ ఏఎస్పీ పిటిషన్​పై విచారించిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. సీబీఐ అధికారిపై నమోదుచేసిన కేసులో చర్యలన్నీ నిలివేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.

ap high court
ap high court

By

Published : Feb 23, 2022, 6:35 PM IST

ys Viveka Case: కడప పోలీసులు సీబీఐ ఏఎస్పీ రామ్​సింగ్​పై నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలిపివేయాలని ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తనపై కడప పోలీసులు నమోదు చేసిన కేసును ఎత్తివేయాలని కోరుతూ రామ్ సింగ్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్​పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. ఉదయ్ కుమార్​ను ఏఎస్పీ బెదిరించలేదని పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు.

కేసు నేపథ్యం ఏంటంటే..

వివేకా హత్య కేసులో తప్పుడు సాక్ష్యం చెప్పాలంటూ తనను సీబీఐ ఏఎస్పీ రామ్​సింగ్ బెదిరిస్తున్నారని ఉదయ్ కుమార్ రెడ్డి కడప కోర్టును ఆశ్రయించారు. కడప కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు పోలీసులు రామ్​సింగ్​పై 195ఏ, 323, 506 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసును సవాల్ చేస్తూ సీబీఐ ఏఎస్పీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం రామ్ సింగ్ వివేకా హత్య కేసు దర్యాప్తు అధికారిగా ఉన్నారు.

ఇదీచూడండి: Viveka Murder Case: వివేకా హత్య కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు

ABOUT THE AUTHOR

...view details