తెలంగాణ

telangana

ETV Bharat / city

మీరు కోర్టుకు రారా..? ఏపీ సీఎం జగన్ పై ఈడీ కోర్టు అసహనం - cbi cases on cm jagan news

వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్​ సీఎం జగన్ దాఖలు చేసుకున్న పిటిషన్​ను సీబీఐ, ఈడీ కోర్టు కొట్టేసింది. ఈనెల 31న ఖచ్చితంగా హాజరు కావాలని ఆదేశించింది. పదే పదే వ్యక్తిగత మినహాయింపులు కోరడంపై న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది.

CBI and ED court  shock to cm jagan
CBI and ED court shock to cm jagan

By

Published : Jan 24, 2020, 7:24 PM IST

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు సీబీఐ, ఈడీ కోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. తన బదులు జగతి పబ్లికేషన్స్ ప్రతినిధి హాజరయ్యేలా అనుమతివ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్​ను కోర్టు కొట్టేసింది. ఈ నెల 31న ఖచ్చితంగా హాజరుకావాలని స్పష్టం చేసింది. వ్యక్తిగత హాజరు నుంచి పదే పదే మినహాయింపులు కోరటంపై న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. మరోసారి గైర్హాజరైతే.. తగిన ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details