తెలంగాణ

telangana

By

Published : Nov 19, 2020, 10:38 PM IST

ETV Bharat / city

జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ ఛార్జ్​షీట్లపై శుక్రవారం విచారణ

సీబీఐ, ఈడీ కోర్టులో ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జరిగింది. జగతి పబ్లికేషన్స్, రాంకీ, వాన్ పిక్ ఛార్జ్‌షీట్లపై విచారణను ఈనెల 23కి వాయిదా వేయగా... జగన్ కేసుల్లో ఈడీ ఛార్జ్​షీట్లపై శుక్రవారం విచారణ జరగనుంది.

jagan
jagan

హైదరాబాద్ సీబీఐ, ఈడీ కోర్టులో ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల విచారణ జరిగింది. జగతి పబ్లికేషన్స్ లో పెట్టుబడులకు సంబంధించిన ఛార్జ్ షీట్ నుంచి విజయ్ సాయిరెడ్డి పేరు తొలగించాలని ఆయన తరఫు న్యాయవాది ఉమా మహేశ్వరరావు వాదనలు కొనసాగించారు.

జగతి పబ్లికేషన్స్, రాంకీ, వాన్ పిక్ సీబీఐ ఛార్జ్ షీట్లపై ఈనెల 23కి.. పెన్నా, భారతీ సిమెంట్స్ కేసుల విచారణ ఈనెల 30కి వాయిదా పడింది. సీబీఐ ఛార్జ్ షీట్ల కన్నా ముందుగా ఈడీ కేసులను విచారణ జరపాలా వద్దా అనే అంశంపై శుక్రవారం వాదనలు కొనసాగనున్నాయి.

ఇదీ చదవండి :'వరద' రాజకీయం... తెరాస, భాజపాల మధ్య మాటల యుద్ధం

ABOUT THE AUTHOR

...view details