తెలంగాణ

telangana

ETV Bharat / city

అతన్ని విధుల్లోకి తీసుకుంటారా? మిమ్మల్ని ఏపీకి పంపించాలా? సీఎస్​కు క్యాట్​ హెచ్చరిక - సీఎస్​పై క్యాట్​ ఆగ్రహం

telangana cs
telangana cs

By

Published : Feb 25, 2022, 7:32 PM IST

Updated : Feb 25, 2022, 8:29 PM IST

19:30 February 25

అభిషేక్ మొహంతిని రెండు వారాల్లో విధుల్లోకి తీసుకోవాలని సీఎస్‌కు క్యాట్​ ఆదేశం

CAT Fires on TS CS: ఐపీఎస్ అధికారి అభిషేక్ మొహంతిని రెండు వారాల్లో విధుల్లోకి తీసుకోవాలని సీఎస్ సోమేశ్​ కుమార్​ను కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ ఆదేశించింది. సీఎస్ సోమేశ్​ కుమార్​పై అభిషేక్ మొహంతి దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్​ను ట్రైబ్యునల్ ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది. అధికారుల విభజనలో భాగంగా అభిషేక్ మొహంతిని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్​కు కేటాయించింది. కేటాయింపు ఉత్తర్వులను సవాల్ చేస్తూ అభిషేక్ మొహంతి కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్​ను ఆశ్రయించారు.

ఎనిమిది నెలలు అయినా...

విచారణ జరిపిన క్యాట్... అభిషేక్ మొహంతిని రిలీవ్ చేయాలని ఏపీకి.. విధుల్లో చేర్చుకోవాలని తెలంగాణను ఎనిమిది నెలల క్రితం ఆదేశించింది. క్యాట్ ఆదేశాల మేరకు అభిషేక్​ను ఏపీ ప్రభుత్వం రిలీవ్ చేసింది. అయితే తెలంగాణ ప్రభుత్వం తనను విధుల్లోకి తీసుకోవడం లేదంటూ సీఎస్ సోమేశ్​ కుమార్​పై అభిషేక్ మొహంతి క్యాట్​లో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. గతంలో విచారణ జరిపిన క్యాట్.. ఇవాళ హాజరు కావాలని సోమేష్ కుమార్ ఆదేశించింది.

సీఎస్​పై క్యాట్​ ఆగ్రహం

హాజరుకు మినహాయింపు ఇవ్వాలని త్వరలో కౌంటరు దాఖలు చేస్తామని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ క్యాట్​ను కోరారు. నిరాకరించిన ట్రైబ్యునల్ గంటలోగా కనీసం ఆన్ లైన్​లో హాజరు కావాలని లేకపోతే నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేస్తామని హెచ్చరించింది. కొద్దిసేపటి తర్వాత వర్చువల్ విచారణకు హాజరైన సోమేష్ కుమార్.. అభిషేక్ మహంతి వ్యవహారంపై కేంద్రానికి లేఖ రాశామని క్యాట్​కు తెలిపారు. తాము ఆదేశించినప్పటికీ.. విధుల్లోకి ఎందుకు తీసుకోలేదని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలతోనే తెలంగాణలో కొనసాగుతున్నారంటూ సోమేశ్​ కుమార్​ను ఉద్దేశించి వ్యాఖ్యానించిన ట్రైబ్యునల్... అవసరమైతే తమ ఉత్తర్వులను పునఃసమీక్షిస్తామని హెచ్చరించింది.

ఇదీ చదవండి :చిత్ర కురులు మెచ్చిన 'హిమాలయన్​ యోగి' అతడే.. తెలిసిపోయిందిగా!

Last Updated : Feb 25, 2022, 8:29 PM IST

ABOUT THE AUTHOR

...view details