తెలంగాణ

telangana

ETV Bharat / city

ఒక్క ఓటే కదా.. అని వదలొద్దు! ఓటేద్దాం రండి!!

ఓటింగ్ డే అంటే హాలిడే అని చాలా మంది ఓటర్లు భావిస్తుంటారు. మరికొందరు తమ ఒక్క ఓటుతో మారిపోయేది ఏముంటుందిలే అని అనుకుంటారు. కానీ ఆ ఒక్క ఓటు విలువ ఎంతో చరిత్రలో నమోదైన కొన్ని ఘటనలు చెబుతాయి. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటూ కీలకమే. ఓటుహక్కు కలిగిన పౌరులందరూ పోలింగ్‌లో తప్పక పాల్గొనాలి.

cast your vote single vote was change results in many times
ఒక్క ఓటే కదా.. అని వదలొద్దు! ఓటేద్దాం రండి!!

By

Published : Dec 1, 2020, 3:07 PM IST

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోలింగ్‌ మందకొడిగా సాగుతోంది. మధ్యాహ్నం 1గంట వరకు కేవలం 18.20శాతం మాత్రమే పోలింగ్‌ నమోదైంది. సెలవులు రావడంతో కొందరు సొంతూళ్లకు వెళ్లిపోగా.. కరోనా భయంతో ఇంకొందరు ఓటు వేసేందుకు ఆసక్తి చూపడంలేదు. కరోనా మార్గదర్శకాలను కఠినంగా అమలు చేస్తున్న అధికారులు.. పోలింగ్‌ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లూ చేశారు. ప్రజలు పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి సురక్షితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఓటేద్దాం రండి.. ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటుదాం పదండి!

ఇవిగో ఉదంతాలు..

  • 1649లో ఇంగ్లాండ్‌ రాజు కింగ్ చార్లెస్‌-1 శిరచ్ఛేదనంపై నిర్ణయం జరిగింది ఒకే ఓటు తేడాతోనే..
  • 1714లో ఒక్క ఓటు ఆధిక్యంతోనే బ్రిటన్‌ రాజు సింహాసనం అధిష్ఠించారు.
  • 1776లో ఒక్క ఓటు తేడాతోనే అమెరికా జర్మనీ భాషను కాదని ఇంగ్లిష్‌ అధికారిక భాష అయింది.
  • 1850లో ఒక్క ఓటు ఆధిక్యంతో కాలిఫోర్నియా రాష్ట్రం ఏర్పడింది
  • 1868లో అమెరికా అధ్యక్షుడు ఆండ్రూ జాన్సన్‌ ఒక్క ఓటుతో పదవీచ్యులతయ్యారు.
  • 1923లో ఒకే ఓటు ఆధిక్యంతో హిట్లర్‌ నాజీ పార్టీకి నాయకుడిగా ఎన్నికయ్యారు.
  • 1999 ఎన్నికల్లో ఓక్క ఓటు తేడాతోనే కేంద్రంలో వాజ్‌పేయీ ప్రభుత్వం పడిపోయింది.
  • 2004 ఎన్నికల్లో కర్ణాటక రాష్ట్రంలోని సంతెమరహళ్లిలో ఒక్క ఓటుతో కాంగ్రెస్‌ అభ్యర్థి ధ్రువనారాయణ గెలిచారు.
  • 2008లో రాజస్థాన్‌లో ఒక్క ఓటు తేడాతో ఓటమిపాలైన ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు సీపీ జోసీనాథ్ ముఖ్యమంత్రి కాలేకపోయారు. ఆ ఎన్నికల్లో జోషి తల్లి, భార్య, డ్రైవర్‌ ఓటు హక్కు వినియోగించుకోలేదు.
  • 2016 ఎన్నికల్లో గ్రేటర్‌ హైదరాబాద్ పరిధిలో జాంబాగ్‌ డివిజన్‌లో తెరాస అభ్యర్థి ఎంఐఎం పార్టీ అభ్యర్థి కేవలం ఐదు ఓట్లు తేడాతో విజయం సాధించారు.

ఇదీ చూడండి:మొదటిసారి ఓటును వినియోగించుకున్న యువత..

ABOUT THE AUTHOR

...view details