సికింద్రాబాద్‌లో ఓల్డ్ బోయిన్‌పల్లిలోని మల్లికార్జుననగర్‌లో పట్టపగలే ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. దాదాపు 18 లక్షల రూపాయల నగదు, 3 కిలోల బంగారు ఆభరణాలు, 32 తులాల బంగారు బిస్కెట్లు, 7 కిలోల వెండి వస్తువులు అపహరణకు గురైనట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. సరళ అనే మహిళ డైలీ ఫైనాన్స్ వ్యాపారం చేస్తూ... ఇద్దరు కుమారులు, కోడలితో కలిసి స్థానికంగా నివాసముంటోంది. కుమారుడిని బండి మీద దింపేందుకు మధ్యాహ్నం మూడున్నరకు వెళ్లి సాయంత్రం ఆరు గంటలకు వచ్చింది. ఇంటి తాళాలు తీసి దొంగతనం చేసినట్లు గమనించింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. బేగంపేట ఏసీపీ రాంరెడ్డి ఘటనాస్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. పోలీసులు ఆధారాలు, సాక్ష్యాలు సేకరించారు. తెలిసినవారే చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
సికింద్రాబాద్‌లో భారీగా నగదు, ఆభరణాల చోరీ - cash gold silver arnaments theft
సికింద్రాబాద్‌లోని ఓల్డ్ బోయిన్‌పల్లిలో ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. 18 లక్షల నగదు, పెద్ద ఎత్తున బంగారు, వెండి ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
సికింద్రాబాద్‌లో భారీగా నగదు, ఆభరణాల చోరీ