తెలంగాణ

telangana

ETV Bharat / city

AP COURT CASES: ఏపీ సర్కార్​కు వ్యతిరేకంగా రోజూ కేసులు..! - తెలంగాణ వార్తలు

ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన కేసులు ఆ రాష్ట్ర హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులో పెద్ద ఎత్తున పోగుపడుతున్నాయి. వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలు అవుతున్న పిటిషన్​లు దాదాపు రోజుకు 450 వరకు ఉంటున్నాయని తెలుస్తోంది. పెండింగ్ కేసుల్లో ప్రభుత్వ శాఖలు, అధికారులపై కోర్టు ధిక్కరణకు సంబంధించిన కేసులే 8 వేల వరకూ ఉన్నట్లు సమాచారం.

AP COURT CASES, cases against ap government
ఏపీలో కోర్టు కేసులు, ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసులు

By

Published : Aug 28, 2021, 5:50 PM IST

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, సుప్రీంకోర్టుల‌్లో ఆ రాష్ట్ర ప్రభుత్వంపై దాఖలై.. పెండింగ్‌లో ఉన్న కేసులు లక్షా 94 వేల మేర ఉన్నట్లు తెలుస్తోంది. వివిధ ప్రభుత్వ శాఖలతో సంస్థలు, వ్యక్తులు వివాద పరిష్కారం కోసం ఈ రెండు కోర్టుల్లో వేసిన కేసులు లక్షలుగా పేరుకుపోవడం జగన్ ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది. ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోజూ వివిధ కోర్టుల్లో సుమారు 450 పిటిషన్​లు దాఖలు అవుతున్నట్టు అంచనా.

ప్రత్యేకించి ప్రభుత్వ శాఖలు, అధికారులపై ఏపీవ్యాప్తంగా 8 వేల కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నట్లు తేలింది. గ్రామ కార్యదర్శి స్థాయి నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వరకు కోర్టు ఆదేశాలకు సంబంధించి ధిక్కరణ కేసులు ఉన్నాయని గుర్తించారు. ఇక ప్రత్యేకంగా ఆర్థిక శాఖ.. వివిధ కోర్టుల్లో ఉన్న 143 పిటిషన్లకు కౌంటర్‌ అఫిడవిట్లు దాఖలు చేయని పరిస్థితులు ఉన్నట్లు సమాచారం.

పెండింగ్‌ కేసుల పరిష్కారం కోసం ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అడ్వకేట్ జనరల్ కార్యాలయం నుంచి ప్రభుత్వ ప్లీడర్ల వరకు పెండింగ్ కేసుల పరిష్కారంపై దృష్టి పెట్టాలని ఉన్నతాధికారులు ఇటీవలే ఆదేశించారు. కోర్టు వివాదాల విషయంలో ఎలాంటి జాప్యానికి తావివ్వకుండా చూడాలని వైకాపా ప్రభుత్వం జీపీలకు నిర్దేశించింది. వివిధ ప్రభుత్వ శాఖలకు కూడా న్యాయ నిపుణులను ఏర్పాటు చేసుకునే విషయంపైనా దృష్టి సారించింది.

ఇదీ చదవండి:RAINS: భాగ్యనగరంలో భారీ వర్షం... లోతట్టు ప్రాంతాలు జలమయం

ABOUT THE AUTHOR

...view details