ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు పీఎస్‌లో.. తెలుగుదేశం సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కేసు నమోదైంది. శశ్రిత టెక్నాలజీ ఎండీ నర్మదకుమార్ ఫిర్యాదు మేరకు.. సోమిరెడ్డిపై కేసు పెట్టారు. చీటింగ్, ఫోర్జరీ, దొంగతనం ఆరోపణలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద ఆయనపై కేసు నమోదైంది.
Case on Somireddy: కృష్ణపట్నం పోర్టు పీఎస్‌లో సోమిరెడ్డిపై కేసు!
తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కృష్ణపట్నం పోర్టు పీఎస్‌లో కేసు నమోదైంది. ఆనందయ్య మందుకు సంబంధించి శశ్రిత వెబ్‌సైట్‌పై ఆరోపణలు చేసినందుకు వెబ్సైట్ నిర్వాహకులు ఆయనపై పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.
సోమిరెడ్డిపై కేసు నమోదు
ఆనందయ్య మందుతో వ్యాపారం చేయడానికి సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి ప్రయత్నాలు చేశారని.. అందుకే శశ్రిత వెబ్సైట్ ప్రారంభమైందని సోమిరెడ్డి శనివారం ఆరోపించారు. ఆ వెబ్సైట్ నిర్వాహకులు పూర్తిగా కాకాణి కనుసన్నల్లో పనిచేస్తున్నారని అన్నారు. ఈమేరకు శశ్రిత నిర్వాహకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి:ATTACK: కార్పొరేటర్ ఇంటిపై మేయర్ భర్త అనుచరుల దాడి