తెలంగాణ

telangana

ETV Bharat / city

case on ycp: తెదేపా కార్యాలయంపై దాడి.. 70 మంది వైసీపీ కార్యకర్తలపై కేసు - vijayawada latest news

ఏపీలో తెదేపా కార్యాలయం(tdp office)పై దాడి విషయంలో వైకాపాకు చెందిన 70 మంది కార్యకర్తలపై మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. కార్యాలయంపై జరిగిన దాడికి సంబంధించి రిసెప్షన్ కమిటీ చైర్మన్ కుమారస్వామి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు.

case on ycp leaders
70 మంది వైసీపీ కార్యకర్తలపై కేసు

By

Published : Oct 20, 2021, 4:08 PM IST

ఏపీలో తెదేపా కార్యాలయం(tdp office)పై దాడి విషయంలో వైకాపాకు చెందిన 70 మంది కార్యకర్తలపై మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. కార్యాలయంపై జరిగిన దాడికి సంబంధించి రిసెప్షన్ కమిటీ చైర్మన్ కుమారస్వామి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు. కార్యాలయంలో తనపై జరిగిన దాడి గురించి బద్రి ఇచ్చిన ఫిర్యాదుపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. బద్రి తల పగలగొట్టినప్పటికీ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేయలేదని తెదేపా నేతలు ఆరోపించారు.

అసలేం జరిగింది..

మంగళగిరి సమీపంలో, డీజీపీ కార్యాలయానికి అత్యంత దగ్గర్లో ఉన్న తెదేపా జాతీయ కార్యాలయంపై పదుల సంఖ్యలో దుండగులు విరుచుకుపడి విశృంఖలంగా దాడికి పాల్పడ్డారు. భయానక వాతావరణం సృష్టించారు. పార్టీ నాయకుడు దొరబాబుతో పాటు మరో ముగ్గురు కార్యాలయ సిబ్బందిని తీవ్రంగా గాయపరిచారు. ఈ దాడిని ముందే పసిగట్టిన తెదేపా కార్యాలయ వర్గాలు ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదు. డీజీపీ కార్యాలయానికి కొన్ని మీటర్ల దూరంలోనే ఇంత బీభత్సం జరుగుతున్నా... పోలీసులు రాలేదు. చేయాల్సిన విధ్వంసమంతా చేసి, అల్లరిమూకలు తీరిగ్గా వాహనాలు ఎక్కి వెళ్లిపోయాక అప్పుడు పోలీసులు వచ్చారు.

ఇదీ చదవండి:

Case on Nara Lokesh: నారా లోకేశ్​పై హత్యాయత్నం కేసు నమోదు!

ABOUT THE AUTHOR

...view details