తెలంగాణ

telangana

ETV Bharat / city

అక్రమంగా విక్రయించారు... అడ్డంగా బుక్కయ్యారు - case on tahsildar in medak

రికార్డులు మార్చి అక్రమంగా భూమిని మరొకరి పేరు మీదకు మార్చినందుకు మెదక్ జిల్లా అందుగులపల్లిలో తహసీల్దార్ రాజేశ్వరరావు, వీఆర్వో ఆంజనేయులతో పాటు మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

అక్రమంగా విక్రయించారు... అడ్డంగా బుక్కయ్యారు

By

Published : Nov 10, 2019, 5:04 AM IST

Updated : Nov 10, 2019, 7:46 AM IST

అక్రమంగా విక్రయించారు... అడ్డంగా బుక్కయ్యారు

మెదక్​ జిల్లా వెల్దుర్తి మండలం అందుగులపల్లి గ్రామానికి చెందిన బూదమ్మ తనకున్న ఒక ఎకరా 23 గుంటల స్థలాన్ని బౌరంపేటకు చెందిన పాపయ్యకు 2011లో విక్రయించింది. ప్రభుత్వం ఇటీవల చేపట్టిన భూప్రక్షాళనను ఆసరాగా చేసుకుని బూదమ్మ కొడుకు పెంటయ్య తహసీల్దార్, వీఆర్వోతో కుమ్మక్కై విక్రయించిన భూమిని తన పేర మార్పించుకున్నాడు.

మళ్లీ అదే భూమిని దుండిగల్​కు చెందిన నర్సింగరావుకు అమ్మారు. గతంలో ఇతరులకు అమ్మిన విషయాన్ని తెలుసుకుని నర్సింగరావు విక్రయాన్ని రద్దు చేశాడు. అనంతరం... తల్లీ కొడుకు కలిసి భూమిని నల్గొండకు చెందిన సురేష్​కు విక్రయించారు.

రైతుబంధు రాకపోవడంతో బయటపడింది..

తనకు రైతుబంధు రాలేదంటూ తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన పాపయ్య.. తన పేరున ఉండాల్సిన భూమి వేరొకరి పేరు మీద ఉందని గుర్తించారు. వెల్దుర్తి పీఎస్​లో ఫిర్యాదు చేశారు.

వెల్దుర్తిలో స్పందించకపోవడమే మంచిదైంది..

వెల్దుర్తి పోలీసుల నుంచి సరైన స్పందన లేనందున పాపయ్య మెదక్ ఎస్పీని ఆశ్రయించారు. ఎస్పీ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు కేసును ఛేదించారు.

అక్రమానికి పాల్పడ్డ తహసీల్దార్ రాజేశ్వరరావు, వీఆర్వో ఆంజనేయులతో పాటు బూదమ్మ, పెంటయ్యపై కేసు నమోదు చేశారు. పెంటయ్య, వీఆర్వోను రిమాండ్​కు తరలించామని తహసీల్దార్​ను త్వరలో అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండిః వెలుగులోకి నయా దందా... ఇదో కొత్త పెళ్లిగోల

Last Updated : Nov 10, 2019, 7:46 AM IST

ABOUT THE AUTHOR

...view details