తెలంగాణ

telangana

ETV Bharat / city

CASE ON JC PRABAHAR: జేసీ ప్రభాకర్ రెడ్జిపై తాడిపత్రిలో కేసు నమోదు - అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి పై కేసు

ఏపీలోని అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ ప్రభాకర్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాడిపత్రి రెండో మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎంపిక సందర్భంగా.. ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని సుమోటోగా పోలీసులు కేసు నమోదు చేశారు.

CASE ON JC PRABAHAR: జేసీ ప్రభాకర్ రెడ్జిపై తాడిపత్రిలో కేసు నమోదు
CASE ON JC PRABAHAR: జేసీ ప్రభాకర్ రెడ్జిపై తాడిపత్రిలో కేసు నమోదు

By

Published : Aug 1, 2021, 4:07 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ ప్రభాకర్‌రెడ్డి(jc prabhakar reddy)పై పోలీసులు కేసు నమోదు చేశారు. తాడిపత్రి రెండో మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎంపిక సందర్భంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని.. 153ఏ, 506 సెక్షన్ల కింద తాడిపత్రి పోలీసులు కేసు నమోదు చేశారు.

అసలేం జరిగింది..

అధికార వైకాపా.. తాడిపత్రి మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నికను బహిష్కరించటం సిగ్గుచేటని తెదేపా నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. తెదేపాకు 19 మంది కౌన్సిలర్లు ఉన్నా..స్వతంత్య్ర అభ్యర్థికి వైస్​ ఛైర్మన్ పదవి కట్టబెట్టామన్నారు. కౌన్సిలర్లను బెదిరించాలని అధికార పార్టీ ప్రయత్నించినా..కుదరలేదని జేసీ ఆరోపించారు. అధికారంలో ఉండి కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించటం పెద్ద తప్పిదమన్నారు. జిల్లాలో ఫ్యాక్షన్ సంస్కృతి అంతరించిపోయిందని.., ఎమ్మెల్యే పెద్దారెడ్డి ప్రైవేటు సైన్యంతో ప్రజలను ఇబ్బందులకు గురి చేయాలని చూస్తున్నారని విమర్శించారు. ప్రైవేటు సైన్యంతో ఆధిపత్యం చెలాయిస్తామంటే తాడిపత్రిలో కుదరదన్నారు.

ఇదీ చదవండి: CBN LETTER TO DGP: హత్యకేసులో సాక్షులకు బెదిరింపులు... డీజీపీకి చంద్రబాబు లేఖ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details