కాచిగూడ ఎంఎంటీఎస్ ప్రమాద ఘటనలో లోకోపైలట్ చంద్రశేఖర్‌పై కేసు నమోదైంది. కాచిగూడ స్టేషన్ మేనేజర్ రవీందర్ ఫిర్యాదుతో సెక్షన్ 337, 338, 308 కింద రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. లోకో పైలట్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని కేసు నమోదు చేసినట్లు పోలీసులు నిర్ధరించారు.
కాచిగూడ ఘటనలో లోకోపైలట్ చంద్రశేఖర్‌పై కేసు - కాచిగూడ రైలు ప్రమాదం
కాచిగూడ రైలు ప్రమాద ఘటనపై రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లోకోపైలట్ చంద్రశేఖర్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
loco pilot
ప్రస్తుతం లోకోపైలట్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిన తర్వాత వాంగ్మూలం తీసుకోనున్నారు. ప్రమాద ఘటనకు సంబంధించి రైల్వే అధికారుల ద్వారా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. స్టేషన్లో సిగల్నింగ్ వ్యవస్థ... రైళ్లు ఫ్లాట్ ఫాం మీదికి చేరుకొని వెళ్లే విధానం గురించి రైల్వే అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తున్నారు.
ఇదీ చూడండి: దద్దరిల్లిన కాచిగూడ రైల్వే స్టేషన్.. ప్రయాణికుల హాహాకారాలు
Last Updated : Nov 12, 2019, 5:06 PM IST