తెలంగాణ

telangana

ETV Bharat / city

కార్గో సర్వీస్​ శాఖను ప్రారంభించిన ఆర్టీసీ డీఎం - tsrtc cargo latest news

హైదరాబాద్​ కుషాయిగూడలో కార్గో, కొరియర్​ సేవలను ఆర్టీసీ డివిజనల్​ మేనేజర్ జగన్​ ప్రారంభించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ​

cargo service branch started at alwal Hyderabad by rtc dm
కార్గో సర్వీస్​ శాఖను ప్రారంభించిన ఆర్టీసీ డీఎం

By

Published : Aug 27, 2020, 3:25 PM IST

రాష్ట్ర ప్రజల అవసరాలు తీర్చేందుకు ఆర్టీసీ కార్గో, కొరియర్​ సర్వీసులు ఏర్పాటుచేసినట్లు హైదరాబాద్​ కుషాయిగూడ డివిజనల్​ మేనేజర్​ జగన్​ తెలిపారు. అల్వాల్​లో ఆర్టీసీ కార్గో, కొరియర్​ సర్వీస్​ బ్రాంచ్​ను ఆయన ప్రారంభించారు.

అనంతరం ఆర్టీసీ కార్గో ఛార్జీలను ప్రకటించారు. ఇంటి సామగ్రి, వ్యాపార వస్తువుల తరలింపునకు 50 కి.మీ వరకు.. 8 టన్నులకు రూ.4,060.. 3 టన్నులకు రూ.3,615 వసూలుచేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు.

ఇవీచూడండి:ఈటీవీ రజతోత్సవ వేళ.. తారల శుభాకాంక్షల వెల్లువ

ABOUT THE AUTHOR

...view details