కేవలం ప్రయాణికులే కాకుండా కార్గో సర్వీసులను రాష్ట్రవ్యాప్తంగా నడపనున్నట్లు సికింద్రాబాద్ కంటోన్మెంట్ డిపో మేనేజర్ కె.కృష్ణమూర్తి తెలిపారు. కంటోన్మెంట్ ఆర్టీసీ బస్సులో కార్గో పార్సిల్, కొరియర్ సేవలను ప్రారంభించారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రెండు షిప్టుల్లో వినియోగదారులకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. టీఎస్ఆర్టీసీ సిబ్బంది... విశ్వసనీయత, కష్టపడి పనిచేసే తత్వానికి నిదర్శనం అన్నారు.
కంటోన్మెంట్ డీపోలో ఆర్టీసీ కార్గో సేవలు ప్రారంభం - tsrtc cargo services
ఆర్టీసీ బస్సులో కార్గో పార్సెల్, కొరియర్ సేవలను సికింద్రాబాద్ కంటోన్మెంట్ డిపో మేనేజర్ కె.కృష్ణమూర్తి ప్రారంభించారు. ప్రజలందరూ ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు.
కంటోన్మెంట్ డీపోల ఆర్టీసీ కార్గో సేవలు ప్రారంభం
కార్గో బస్సు సర్వీసులకు నూతనంగా ఏజెంట్లను నియమించామని. త్వరలో ట్రాకింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తామని కృష్ణమూర్తి తెలిపారు. ప్రజలందరూ ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని ఆయన కోరారు.
ఇదీ చూడండి:భద్రాచలం గోదావరి వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ
TAGGED:
tsrtc cargo services