తెలంగాణ

telangana

ETV Bharat / city

వాగులో చిక్కుకున్న కారు.. స్థానికులు గమనించి ఏం చేశారంటే? - నాగులుప్పలపాడు

CAR TRAPPED: ఉపరితల ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్​లోని ప్రకాశం జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నాగులుప్పలపాడు సమీపంలోని కొత్తకోట వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. అయితే ఈ మార్గంలో వెళ్తున్న ఓ కారు ప్రవాహానికి కొట్టుకుపోయింది. దాన్ని గమనించిన స్థానికులు కారులో ఉన్న వారిని రక్షించారు.

CAR TRAPPED
CAR TRAPPED

By

Published : Oct 6, 2022, 4:57 PM IST

వాగులో చిక్కుకున్న కారు.. స్థానికులు గమనించి ఏం చేశారంటే!!

RAINS IN PRAKASAM:ఆంధ్రప్రదేశ్​లోని ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలో పెను ప్రమాదం తప్పింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు.. నాగులుప్పలపాడు మండలం గ్రోత్‌ సెంటర్ నుంచి ఉప్పుగుండూరు వెళ్లే మార్గంలో కొత్తకోట కాలువ.. ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ మార్గంలో వెళ్తున్న ఇన్నోవా కారు.. వాగు మధ్యలోకి వెళ్లగానే ప్రవాహానికి కొట్టుకుపోయింది.

దాన్ని గమనించిన స్థానికులు కారులోని వారిని రక్షించారు. ట్రాక్టర్ సహాయంతో కారును కూడా బయటికి లాక్కొచ్చారు. కారు కొట్టుకుపోయే సమయంలో స్థానికులు అక్కడే ఉండటంతో.. పెద్ద ప్రమాదం తప్పింది. ఎవరూ లేకపోతే.. కారులో ఉన్న ముగ్గురు గల్లంతయ్యే ప్రమాదం ఉండేది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details