దిల్లీలో రైతుల పోరాటానికి తెరాస ఎన్నారై నాయకులు మద్దతు తెలిపారు. కర్షకులకు సంఘీభావం ప్రకటిస్తూ.. లండన్‌లో కారు ర్యాలీ చేపట్టారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయని, వాటిని ఉపసంహరించుకోవాలని తెరాస ఎన్నారై వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం డిమాండ్ చేశారు.
రైతుల పోరాటానికి మద్దతుగా లండన్‌లో కారు ర్యాలీ
దిల్లీలో రైతుల పోరాటానికి ప్రతి ఒక్కరు మద్దతివ్వాలని, ఇది కేవలం పంజాబ్ రైతుల సమస్యే కాదని తెరాస ఎన్నారై వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం అన్నారు. రైతులకు మద్దతుగా లండన్‌లో కారు ర్యాలీ చేపట్టారు.
రైతుల పోరాటానికి మద్దతుగా లండన్‌లో కారు ర్యాలీ
ఈ పోరాటం కేవలం పంజాబ్ రైతులది మాత్రమే కాదని, దేశవ్యాప్తంగా కర్షకులు, రవాణా సంఘాలు, చిల్లర వర్తకులు, వ్యవసాయంతో అనుబంధమున్న ప్రతి ఒక్కరిదని అన్నారు. నేటి భారత్ బంద్‌లో ప్రతి ఒక్కరు పాల్గొని రైతులకు అండగా నిలవాలని, బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు.
- ఇదీ చూడండి :రైతు భవిత పరాధీనం- అందుకే అన్నదాత ఆగ్రహం!