తెలంగాణ

telangana

కారులో మంటలు.. సాంకేతిక లోపమా.. నిర్లక్ష్యమా..?

By

Published : Dec 16, 2019, 8:27 PM IST

Updated : Dec 16, 2019, 11:46 PM IST

కార్లు అగ్నికి ఆహుతి కావటం ఇటీవల కాలంలో మరింత పెరుగుతోంది. ప్రయణిస్తుండగానే మంటలు ఎగసిపడటంపై ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. కారులో మంటలకు నిర్లక్ష్యమా..? సాంకేతిక లోపమా అనేది చాలామందికి తెలియదు. వీటిని నిరోధించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈటీవి భారత్​ ప్రత్యేక కథనం.

కారులో మంటలు.. సాంకేతిక లోపమా.. నిర్లక్ష్యమా..?
కారులో మంటలు.. సాంకేతిక లోపమా.. నిర్లక్ష్యమా..?

కారులో మంటలు.. సాంకేతిక లోపమా.. నిర్లక్ష్యమా..?

ప్రస్తుతం మార్కెట్​లోకి వస్తున్న కార్లలో కార్బొరేటర్ల దగ్గర నుంచి ప్రతిదీ ఎలక్ట్రానిక్‌ కంట్రోల్‌ యూనిట్‌ నియంత్రిస్తుంది. కార్ల అదనపు హంగులు ఏర్పాటు చేయడం వల్ల బ్యాటరీ సామర్థ్యానికి మించి ఏసీలు, దీపాలు, హారన్స్​ వినియోగిస్తున్నారు. దీనివల్ల బ్యాటరీపై భారం పడి నిప్పురవ్వలు వెలువడటం వల్ల మంటలంటు కుంటున్నట్లు ఎలక్ట్రిషియన్​లు చెబుతున్నారు.

అదనపు హంగులే సగం కారణం
మెకానికల్‌ కంటే ఎలక్ట్రికల్‌వి పెరిగిపోవడం వల్ల ఎక్కడ తేడా వచ్చినా మంటలంటుకుంటున్నాయని మెకానికల్​ ఇంజినీర్లు అభిప్రాయపడుతున్నారు. కార్లను కొనేప్పుడు భారీ మొత్తంలో వెచ్చించిన్నప్పటికీ.. వాటిలో వాడే అదనపు హంగుల కోసం మాత్రం కొందరు నాసిరకం ఎలక్ట్రికల్‌ పరికరాలు ఉపయోగిస్తున్నారు.

"సామర్థ్యానికి మించి బ్యాటరీ వినియోగం పెరిగినప్పుడు షార్ట్‌సర్క్యూట్‌ సంభవిస్తుందని అభిప్రాయపడుతున్నారు"
నడిపే ముందు ఒక సారి పరిశీలించండి"


ప్రమాదాల నివారణకు మన్నిక కల్గినవి, పేరెన్నిక కల్గిన విడిభాగాలను వాడాలని సూచిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో పార్కింగ్ సమస్య వేధిస్తుంది. ఎక్కడపడితే అక్కడ కార్లను పార్కింగ్ చేయడం వల్ల ఎలుకలు కార్లలోకి వెళ్లి వైర్లను కొరికేస్తున్నాయని ఎలక్ట్రిషియన్లు పేర్కొంటున్నారు. షార్ట్‌సర్క్యూట్​కు ఇదికూడా ప్రధాన కారణమని హెచ్చరిస్తున్నారు.

సర్వీసింగ్​ తప్పనిసరి
మంటల్లో చిక్కుకున్న వాహనాలను గమనిస్తే ఎక్కువ దూరం తిరిగినవే అధికంగా ఉంటున్నాయని డ్రైవర్లు పేర్కొంటున్నారు. పెట్రోల్, గ్యాస్ వాహనాలతో పోల్చితే డీజిల్ వాహనాల్లో తక్కువ శాతం మంటలు సంభవిస్తాయన్నారు. 40 నుంచి 70 వేల కిలోమీటర్లు తిరిగిన వాహనాలను సర్వీసింగ్​ చేయించాలని లేదంటే ప్రమాదం కొని తెచ్చుకున్నట్లేనని స్పష్టం చేస్తున్నారు.

ఇవీ చూడండి: వంటిల్లు లేని విద్యుత్తు కనెక్షన్లపై భారీగా వడ్డన..!

Last Updated : Dec 16, 2019, 11:46 PM IST

ABOUT THE AUTHOR

...view details