హైదరాబాద్ అమీర్‌పేటలోని ధరమ్‌కరమ్ రోడ్డులో పార్కు చేసిన పాత కారు అగ్నికి ఆహుతైంది. పనికి రాకుండా ఉన్న పాత కారును కొద్ది రోజులుగా రోడ్డు పక్కన నిలిపి ఉంచారు. ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి.
రోడ్డు పక్కనే కారులో మంటలు.. పూర్తిగా దగ్ధం - car accident in ameerpet
చాలా రోజులుగా రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన హైదరాబాద్ అమీర్‌పేటలో జరిగింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చే లోపే కారు పూర్తిగా దగ్ధమైపోయింది.
car burnt at ameerpet dharam karam road
చూస్తూండగానే కారు పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పేశారు. అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.