తెలంగాణ

telangana

ETV Bharat / city

Amaravati farmers : అమరావతి తీర్పుపై రైతుల సంతోషం

Amaravati farmers : అమరావతికి అనుకూలంగా ఏపీ హైకోర్టు తీర్పు ఇవ్వడంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. హైకోర్టు ప్రాంగణం బయట సాష్టాంగ నమస్కారం చేశారు. హైకోర్టు ముందు నిలబడి తీర్పుపై కృతజ్ఞతలు తెలిపారు. మోకాళ్లపై కూర్చుని నమస్కారం చేశారు. రాజధాని గ్రామాల్లో సంబురాలు జరుపుకున్నారు.

Amaravati farmers
Amaravati farmers

By

Published : Mar 3, 2022, 1:12 PM IST

అమరావతి తీర్పుపై రైతుల సంతోషం.. మిఠాయిలు పంచుకుని సంబరాలు

Amaravati farmers: పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఏపీ హైకోర్టు తీర్పు ఇవ్వడంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. హైకోర్టు ప్రాంగణం బయట సాష్టాంగ నమస్కారం చేశారు. హైకోర్టు ముందు నిలబడి తీర్పుపై కృతజ్ఞతలు తెలిపారు. మోకాళ్లపై కూర్చుని నమస్కారం చేశారు.

Amaravati farmers Thanked AP High Court :రైతులు తుళ్లూరులో సంబురాలు నిర్వహించారు. ఒకరికొకరు తినిపించుకుంటూ సంతోషం వ్యక్తం చేశారు. మహిళలు వీరతిలకం దిద్దికున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా తన మొండి వైఖరిని విడనాడి రాజధానిని అభివృద్ధి చేయాలని రైతులు మహిళలు డిమాండ్ చేశారు. ఇది రైతుల విజయంగా మహిళలు అభివర్ణించారు. 807 రోజులుగా తాము చేస్తున్న ఉద్యమానికి ఈరోజుతో ఫలితం దక్కిందని తెలిపారు.

ఇదీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details