తెలంగాణ

telangana

ETV Bharat / city

'ప్రధాని నోట బోయిన్​పల్లి మార్కెట్ ప్రస్తావన సంతోషం' - రంగారెడ్డి జిల్లా తాజా వార్తులు

మన్‌కీ బాత్‌ కార్యక్రమంలో ప్రధాని మోదీ బోయిన్‌పల్లి మార్కెట్​లోని బయో ఫ్యూయల్‌ ఉత్పత్తిపై.. ప్రశంసల జల్లు కురిపించడం ఎంతో గొప్ప విషయమని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. పాడైపోయిన కూరగాయల నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేయడం శుభపరిణామం అని తెలిపారు.

Cantonment MLA Sayanna
ప్రధాని నోట బోయిన్పల్లి మార్కెట్ ప్రస్తావన రావడం సంతోషం

By

Published : Jan 31, 2021, 3:33 PM IST

మన్‌కీ బాత్‌ కార్యక్రమంలో ప్రధాని మోదీ బోయిన్‌పల్లి మార్కెట్​లోని బయో ఫ్యూయల్‌ ఉత్పత్తిపై.. ప్రశంసల జల్లు కురిపించడం ఎంతో గొప్ప విషయమని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న తెలిపారు. పాడైపోయిన కూరగాయల నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేయడం శుభపరిణామమన్నారు. ప్రతిరోజూ 10 టన్నుల చెత్త నుంచి బయో ఫ్యూయల్‌ ఉత్పత్తి చేస్తున్నామని పేర్కొన్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా బోయిన్​పల్లి మార్కెట్లో ఈ ప్రయోగాన్ని చేపట్టి సత్ఫలితాలు సాధించడం ఆదర్శనీయమనిసాయన్న ఆనందం వ్యక్తం చేశారు. ప్రధాని నోట ఈ బయో గ్యాస్ ప్లాంట్ ప్రస్తావన రావడం సంతోషకరమని అన్నారు. బోయిన్​పల్లి మార్కెట్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉండడం హర్షణీయమనిఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఇదీ చదవండి:టీకా పంపిణీలో భారత్​ సరికొత్త రికార్డులు

ABOUT THE AUTHOR

...view details