తెలంగాణ

telangana

ETV Bharat / city

'కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధే లక్ష్యం' - తెలంగాణ వార్తలు

కంటోన్మెంట్​లోని రెండో వార్డులో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. రసూల్​పురాలోని జిల్లా పరిషత్ స్కూల్ వద్ద సీసీ రోడ్లు, నీటి పైప్​లైన్ నిర్మాణ పనులు ప్రారంభించారు. ప్రజల కనీస అవసరాలు తీర్చడంతోపాటు ఇతర సమస్యలూ పరిష్కరించేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామన్నారు.

cantonment-development-programmes-starts-by-second-ward-chairman-sadhakeshava-reddy
'కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధే లక్ష్యం'

By

Published : Jan 2, 2021, 7:55 PM IST

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా సంక్షేమాభివృద్ధి పథకాలతో దూసుకెళ్తున్నట్లు కంటోన్మెంట్ రెండో వార్డు సభ్యులు సధాకేశవ రెడ్డి తెలిపారు. రసూల్​పురాలోని జిల్లాపరిషత్ స్కూల్ వద్ద సీసీ రోడ్లు, నీటి పైప్​లైన్ పనులు ప్రారంభించారు.

కంటోన్మెంట్​లో మురికివాడగా పేరున్న రసూల్​పుర ప్రాంతంలో అనేక అభివృద్ధి పనులు చేస్తూ.. మౌలిక సదుపాయాల కల్పనలో ముందుకెళ్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజల కనీస అవసరాలు తీర్చడంతోపాటు ఇతర సమస్యలూ పరిష్కరించేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రెండో వార్డు ఇంఛార్జి అశోక్ గౌడ్​, జబ్బర్, ధన్​రాజ్, శ్రీను, ఇలియాస్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:కొత్త సంవత్సరంలో నూతనోత్సాహంతో పనిచేయండి: మంత్రి

ABOUT THE AUTHOR

...view details