భాగ్యనగరంలో కురిసిన భారీ వర్షాలతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం పూర్తిగా దెబ్బదిన్నదని, రూ.100 కోట్లు విడుదల చేయాలని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు రామకృష్ణ డిమాండ్ చేశారు. బేగంపేటలోని ప్యాట్నీనగర్ నాలాను జేఏసీ నాయకులతో కలిసి పరిశీలించారు. కంటోన్మెంట్‌కు రావలసిన రూ.80 కోట్ల బకాయిలను కూడా త్వరితగతిన విడుదల చేయాలని కోరారు.
కంటోన్మెంట్ ఏరియాపై వివక్ష వీడాలి: రామకృష్ణ - సికింద్రాబాద్‌లో వరద ప్రభావిత ప్రాంతాల్లో కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు రామకృష్ణ పర్యటన
వరదలకు పూర్తిగా దెబ్బతిన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని పలు ప్రాంతాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని... కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు రామకృష్ణ కోరారు. వరద ప్రభావిత ప్రాంతాలను జేఏసీ నాయకులతో కలిసి పరిశీలించారు.
కంటోన్మెంట్ కూడా తెలంగాణలో అంతర్భాగమే: రామకృష్ణ
కంటోన్మెంట్ ప్రాంతం కూడా తెలంగాణలో అంతర్భాగమేనని... ప్రభుత్వం వివక్షను వీడాలని మంత్రి కేటీఆర్‌కు సూచించారు. వరదల అనంతరం కేటీఆర్ సుడిగాలి పర్యటనతో ఒరిగిందేమీ లేదని విమర్శించారు. గతంలో కంటోన్మెంట్ బోర్డు తరఫున విస్తరణ, పునరుద్ధరణ పనుల గురించి అనేక నివేదికలు వచ్చినప్పటికీ ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదని ఆరోపించారు. త్వరలోనే భాజపాలో చేరనున్నట్టు వెల్లడించారు.
ఇదీ చూడండి:వరద బాధితులకు మంత్రి కేటీఆర్ పరామర్శ