తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆ ఆదేశాలు రద్దు చేయాలని సీఎస్​కు చంద్రబాబు లేఖ - Chandrababu Latest News

ఏపీ సీఎస్‌ ఆదిత్యనాథ్ దాస్‌కు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. కుప్పం రెస్కో స్వాధీనం ఆదేశాలు రద్దు చేయాలని కోరారు. ఈఆర్‌సీ తీసుకున్న నిర్ణయం నిరాశకు గురి చేసిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

chandrababu letter to cs, ap cs news
ఆ ఆదేశాలు రద్దు చేయాలని సీఎస్​కు చంద్రబాబు విజ్ఞప్తి

By

Published : Mar 27, 2021, 10:34 PM IST

ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌కు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. కుప్పం రూరల్ ఎలక్ట్రిక్ కోఆపరేటివ్ సొసైటీ (రెస్కో) స్వాధీనం ఆదేశాలు రద్దు చేయాలని లేఖలో కోరారు. కుప్పం రూరల్ ఎలక్ట్రిక్ కోఆపరేటివ్ సొసైటీపై ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని పేర్కొన్నారు.

అమ్మకం, పంపిణీ, లైసెన్స్ కారణాలతో ఏకపక్ష చర్య సరికాదన్న చంద్రబాబు.. రెస్కోకు లక్షా 24 వేల గృహ, వాణిజ్య, పారిశ్రామిక, సాగు కనెక్షన్లు ఉన్నాయని వివరించారు. రెస్కోను ఎస్‌పీడీసీఎల్‌లో విలీనం చేయడం అర్థం లేని పని అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఈఆర్‌సీ తీసుకున్న నిర్ణయం నిరాశకు గురిచేసిందని తెదేపా అధినేత వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండీ :వైరల్​గా మారిన ఆ ఎమ్మెల్యే వ్యాఖ్యలు

ABOUT THE AUTHOR

...view details