ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైకాపాలో.. గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మున్సిపల్ ఛైర్మన్ ఎంపికపై.. పార్టీలో క్యాంపు రాజకీయాలు షురూ అయ్యాయి.
17 మంది కౌన్సిలర్లతో అజ్ఞాతంలోకి ఆ ప్రజాప్రతినిధి
ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మున్సిపల్ ఛైర్మన్ ఎంపికపై వైకాపాలో క్యాంపు రాజకీయాలు మెుదలయ్యాయి. అధికార పార్టీకి చెందిన ప్రముఖ ప్రజాప్రతినిధుల మధ్య ఛైర్మన్ ఎంపికలో విభేదాలు తలెత్తాయి.
వైకాపాకు కొత్త తలనొప్పి.. ఛైర్మన్ ఎంపికలో విభేదాలు
ప్రముఖ ప్రజాప్రతినిధి.. 17 మంది కౌన్సిలర్లతో అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఆ కౌన్సిలర్ల ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. ఛైర్మన్ ఎంపికలో ఓ కేంద్ర స్థాయి ప్రజాప్రతినిధి పావులు కదుపుతున్నట్లు సమాచారం. 25 వార్డుల్లో గెలిచిన వైకాపాకు.. ఆధిక్యం ఉన్నా ఇద్దరు ప్రజాప్రతినిధుల విభేదాలతో క్యాంపు రాజకీయాలు కలకలం సృష్టిస్తున్నాయి.